Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు కోరినట్టుగా ఆదేశాలివ్వలేం.. ఏపీ సీఐడీకి షాకిచ్చిన హైకోర్టు

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (13:02 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెంట ఇద్దరు డీఎస్పీలు పెట్టాలన్న ఏపీ సీఐడీ పోలీసులకు ఏపీ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర బెయిల్‌ మంజూరు సమయంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగుతాయని హైకోర్టు స్పష్టంచేసింది. 
 
చంద్రబాబు మధ్యంతర బెయిల్‌లో ఇంకొన్ని అదనపు షరతులు విధించాలంటూ హైకోర్టులో సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం... స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడొద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అలాగే, రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. 
 
నటి జీవిత రాజశేఖర్‌పై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?  
 
సినీ నటి జీవిత రాజశేఖర్‌పై సెన్సార్ బోర్డుకు నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం సెన్సార్ రివైజింగ్ కమిటిలో సభ్యురాలిగా తాత్కాలికంగా ఆమెను పక్కన బెట్టాలని కోరారు. 
 
ఏపీలోని రాజకీయాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు రాం గోపాల్‌వర్మ తెరకెక్కించిన చిత్రమే 'వ్యూహం'. ఈ నెల పదో తేదీన విడుదలవుతుంది. ఈ క్రమంలో సెన్సార్‌కు వెళ్లారు. అయితే, ఈ చిత్రం రాజకీయ వివాదాలను సృష్టించేలా ఉందని సెన్సార్‌ బోర్డు పేర్కొంది. 
 
దీనిపై రివ్యూ కమిటీకి వెళ్లాలని సూచించింది. సంబంధిత కమిటీలో జీవిత సభ్యురాలిగా ఉన్నారు. దాంతో, ఆమె అధికార వైకాపాకు అనుకూలమని, రివ్యూ కమిటీలో ఈ చిత్రానికి పచ్చజెండా ఊపేస్తారంటూ నట్టి కుమార్ వంటి నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ సెన్సార్ రివైజింగ్ కమిటీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా పక్కన బెట్టాలంటూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై నటి జీవిత స్పందించారు. తనకు వైకాపాతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్‌ అవుతోన్న తన ఫొటోలు (పార్టీ కండువాతో వున్నవి) పాతవేనని స్పష్టంచేశారు. తన గురించి కొందరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 
 
తాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నానని తెలిపారు. 'వ్యూహం' (అనే సినిమా ఆర్‌.సి (రివ్యూ కమిటీ)కి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే దాన్నీ చూస్తా. అయితే నాకు ఆఫీస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు' అని జీవిత వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments