Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదంలో గాయపడి రక్తమోడుతున్నా కనికరించని ఢిల్లీ వాసులు...

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (12:27 IST)
దేశ రాజధాని ఢిల్లీలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడి రోడ్డుపై పడిపోయిన క్షతగాత్రుడు తీవ్రమైన రక్తస్రావంతో బాధపడుతున్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చివరకు పోలీసులు వచ్చి ఆ క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 
ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే, దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో పీయూష్ బైక్ (30) అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంతో పీయూష్ అల్లంత దూరం ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదం తర్వాత రోడ్డుపై రక్తపు మడుగులో పడివుంటే చుట్టూ ఉన్న జనం అతడిని ఆసుపత్రికి తరలించడమో, పోలీసులకు సమాచారం అందించడమో చేయకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. 
 
అంతటితో ఆగలేదు. అతడి 'గోప్రో'ను చోరీ చేసి తీసుకెళ్లిపోయారు. సౌత్ ఢిల్లీలో జరిగిందీ ఘటన. బాధితుడిని డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ పీయూష్ పాల్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్టోబరు 28న రాత్రి 10 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 
 
ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కలవారు స్పందించి ఉంటే ఆయన బతికి ఉండేవాడని పీయూష్ స్నేహితుడు తెలిపారు. రక్తమోడుతూ రోడ్డుపై విలవిల్లాడుతున్న పీయూష్ చుట్టూ మూగిన జనం ఫొటోలు, వీడియోలు తీయడంలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తంచేశాడు. దాదాపు 20 నిమిషాలపాటు పీయూష్ అలాగే రోడ్డుపై పడి ఉన్నాడని, ఆయన శరీరంలోని రక్తం మొత్తం పోయిందని పేర్కొన్నాడు. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వెనక నుంచి వచ్చి పీయూష్‌ను ఢీకొట్టిన బైకర్‌ను బంటీగా గుర్తించి నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments