Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ప్రవేశాలు ఆన్ లైన్లో వద్దు: ఏపీ హైకోర్టు ఆదేశాలు

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (15:41 IST)
ఏపీలో ఈసారి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్ లైన్ విధానంలో చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌య‌త్నానికి  చుక్కెదురైంది. ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లు వద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇంటర్ లో ప్రవేశాలను గతంలో మాదిరే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆన్ లైన్ అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది.
 
గత నెల 26న ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగ్గా, వాదనలు పూర్తి స్థాయిలో విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఆన్ లైన్ అడ్మిషన్లకు స్పష్టమైన విధివిధానాలు లేవని పిటిషనర్లు వాదనలు వినిపించారు. సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి తదితరులు ఆన్ లైన్ అడ్మిషన్ల అంశంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ఇంటర్ ప్రవేశాలు ఆన్ లైన్లో వద్ద‌ని తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments