Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత‌కీ హైకోర్టు త‌ర‌లుతోందా? కొత్త భ‌వ‌నం ఎందుకు?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:54 IST)
ఏపీలో మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ ఎపుడు అమ‌లు అవుతుంద‌నేది అంద‌రికీ మిస్ట‌రీగా మారుతోంది. ఒక ప‌క్క ప‌రిపాల‌నా రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు త‌ర‌లడం లేదు. మ‌రో ప‌క్క న్యాయ రాజ‌ధాని క‌ర్నూలుకు ఇంకా త‌ర‌ల‌నే లేదు. పైగా, ఇపుడున్న అమ‌రావ‌తి హైకోర్టులో అద‌న‌పు భ‌వ‌నాల నిర్మాణానికి టెండ‌ర్లు పిలిచారు.

హైకోర్టు ప్రాంగణంలో రూ.29.40 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు ఏఎంఆర్డీయే టెండర్లు పిలిచింది. 14కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో ఇది రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతానికి జీ+3 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనాన్ని భవిష్యత్తులో అవసరమైతే జీ+5కు విస్తరించేందుకు అనువుగా పునాదులు వేయనున్నారు.

ఈ భవంతి నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ కం రివర్స్‌ ఆక్షన్‌ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు 16నుంచి వచ్చే నెల 1లోపు దాఖలు చేయాలి. కాగా, రాజధాని గ్రామాల్లో పారిశుధ్య పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఏఎంఆర్డీయే చేపట్టింది. సుమారు రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో 2 టెండర్లను ఆహ్వానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం