ఏపీ ఎంసెట్ (AP EAMCET) పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ sche.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎంసెట్ (AP EAMCET)పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోగలరు.
గూగల్ లో అధికారిక వెబ్ సైట్ sche.ap.gov.inను తెరవండి.
కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత లాగ్ ఇన్ సంబంధిత ఆధారలను ఎంటర్ చేయండి
తరువాత మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనపడుతుంది.
మీ హాల్ టికెట్ పై వివరాలను సరి చూసుకున్న తరువాత డౌన్లోడ్ చేసుకోండి
ఏపీ ఎంసెట్ (AP EAMCET 2021 Hall Ticket) పరీక్షలు ఆగస్ట్ 19, 20, 23, 24 మరియు 25, 2021 న నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ మరియు పార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ లను సెప్టెంబర్ 3, 6 మరియు 7, 2021 న నిర్వచిన్చానున్నారు.
ఏపీ ఎంసెట్ పరీక్షలను రెండు షిఫ్ట్ లుగా ఉదయం 9 గం.ల నుండి మధ్యహ్నం 12గం.ల వరకి మరియు మధ్యహ్నం 3 గం.ల నుండి సాయంత్రం 6గం.ల వరకు నిర్వహించనున్నారు. ఏపీ ఎంసెట్ పరీక్ష హాల్ టికెట్ పైన పేరు, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, సమయం మరియు పరీక్ష రోజు పాటించాల్సిన నియామాల గురించి తెలుపబడతాయి.
ఈ టెస్ట్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మా కాలేజీలకు ప్రవేశం కలిపించే ఈ పరీక్ష గురించి ఇతర వివరాలు తెలుసుకోటానికి అధికారిక వెబ్ సైట్ AP EAMCET సందర్శించండి.