Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగులను సొంత మనుషుల్లా చూసుకుని వైద్యం అందించాలి. : శ్రీకాంత్ రెడ్డి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:35 IST)
కోవిడ్ కేర్ సెంటర్‌కు వస్తున్న రోగులను సొంతమనుషుల్లా చూసుకుని వైద్యం అందించాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రాయచోటి పట్టణ శివార్లలోని రాజంపేట మార్గంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ను శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలు, ఆహారం, పారిశుద్యపు చర్యలు, తదితర సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు. 
 
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్‌లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇక్కడ  వైద్యులు, సిబ్బంది  పూర్తి స్థాయిలో షిప్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. మంచి పోషకాహారాన్ని అందిస్తున్నారన్నారు. 
 
ప్రత్యేక మైన సిబ్బందిచే పారిశుద్యపు చర్యలు  భేషుగ్గా ఉన్నాయన్నారు. ఈ కేంద్రం నందు ఇప్పటికి 6 మంది అడ్మిషన్ అయ్యారన్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ నందు 130 పడకలు ఉన్నాయన్నారు. రాయచోటి, పరిసర ప్రాంతాలుకు చెందిన వారెవరైనా వైరస్ బారిన పడిన వారు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వసతి సౌకర్యాలతో ఈకేంద్రంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ నిర్దారణ రిపోర్ట్ రాకున్నా కానీ వారిని ప్రత్యేక గదులలో ఉంచి వైద్యం అందించాలని శ్రీకాంత్ రెడ్డి వైద్యులకు సూచించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments