Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణను వదిలిపెట్టని ప్రభుత్వం.. బెయిల్ రద్దు కోసం..

Webdunia
గురువారం, 12 మే 2022 (11:07 IST)
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణను ఏదో రూపంలో అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిపట్టుతో ఉంది. అందుకే ఆయనకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలన్న భావిస్తుంది. 
 
ఏపీలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధిపతిగా ఉన్న నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అయితే, ఆయనపై సీఐడీ పోలీసులు మోపిన అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలుకు వెళ్ళకుండానే నారాయణ విడుదలయ్యారు. దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది.

అదేసమయంలో నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై గురువారం లంచ్ మోషన్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ మేరకు న్యాయనిపుణులతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.

ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కోర్టులో నారాయణకు ఊరట లభించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆయన్ను వదిలిపెట్టేలా లేదు. మేజిస్ట్రేట్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించగా ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments