Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత ప్రభుత్వంలా మేం తప్పులు చేయలేం : ఆర్-5 జోన్‌ లబ్దిదారులకు శుభవార్త!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (16:59 IST)
గత ప్రభుత్వంలా అడ్డుగోలు తప్పులు తాము చేయలేమని, అందువల్ల ఆర్-5 జోన్ లబ్దిదారులకు వారి సొంత స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించలేమని, వారివారి సొంత స్థలాల్లోనే స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. సోమవారం అమరావతిలో జిల్లాల కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబు ఆర్-5 జోన్‌పై ప్రత్యేకంగా చర్చించారు. ఆర్-5 జోన్ లబ్దిదారులకు వాళ్ల వాళ్ల ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలని సీఎం  చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 
 
ఆర్-5 జోన్ లబ్దిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారి కోసం భూసేకరణ చేపట్టాలని, అవసరమైతే టిడ్కో గృహాల తరహాలో ఇల్లు కట్టించి ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పేదలను తీసుకొచ్చి అమరావతిలో ఆర్-5 జోన్‌ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం తెలిసిందే. ఆ విధంగా తీసుకొచ్చిన పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామే తప్పా.. వారికి అమరావతిలో స్థలాలు కేటాయించలేమని చంద్రబాబు స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments