Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ జగన్‌ను మాస్ ర్యాగింగ్ చేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు (Video)

govt employee

వరుణ్

, శుక్రవారం, 2 ఆగస్టు 2024 (09:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆయన దిగిపోయేంతవరకు ప్రభుత్వ ఉద్యోగులతో ఓ ఆట ఆడుకున్నారు. నానా విధాలుగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల్లో ఒకటి.. నెల జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం. ఒక వేళ ఇచ్చినా వాయిదాల రూపంలో ఇవ్వడం. ఇలా గత ఐదేళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగాలు నెల జీతం ఎపుడు వస్తుందోనంటూ ఎదురు చూపులు చూశారు. 
 
అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు జగన్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పించారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, ఉప ముఖ్యమంత్రిగా సినీ హీరో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పైగా, టీడీపీ - జనసేన - బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు సామాజిక పింఛన్లతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో ఉదయానికల్లా వేతనాలు బ్యాంకు ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటూ, జగనన్నను వీడియోలతో మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దివ్యాంగులను కింపచరిచిన స్మితను తొలగించాల్సిందే : హైదరాబాద్‌లో నిరసన