Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ చిరస్మరణీయుడు: గవర్నర్ బిశ్వ భూషణ్

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (21:41 IST)
విజయవాడ: అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించి, నాడు ఎంతో మంది యువత స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి ప్రేరణగా నిలిచిన నేతాజీ సుబాష్ చంద్రబోస్ చిరస్మరణీయుడని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాల్‌లో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 
 
నగర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వభూషణ్ హరిచందన్ తొలుత నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం కటక్‌లోని నేతాజీ జన్మస్థలాన్ని తాను చాలాసార్లు సందర్శించగలిగినందుకు గర్వపడుతున్నానన్నారు.
 
తన విద్యాభ్యాసం కటక్‌లోనే సాగిందని, అక్కడి నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు నేతాజీ జన్మస్థలాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించానని వివరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడన్న గవర్నర్, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో నేతాజీ దేశం కోసం ఎంతో కృషి చేశారని, గొప్ప నాయకుడిగా, భరతమాత పుత్రునిగా ఆయనకు గర్తుచేసుకోవటం, నివాళి అర్పించటం దేశ పౌరులుగా గర్వపడవలసిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జున రావు మరియు రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మేయర్ జంధ్యాల శంకర్, సీనియర్ జర్నలిస్టు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, స్వాతి వార, మాన పత్రిక ఎడిటర్ శ్రీ వేమూరి బలరాం, ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళి, పురావస్తు నిపుణుడు ఈమని శివనాగి రెడ్డి, అచార్య ఎం.సి. దాస్, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ సమరం, ఎస్ఆర్ఆర్, సివిఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి, గ్రంధాలయ ఉద్యమ కారిణి రావి శారద, అకాశవాణి మాజీ సంచాలకులు వేదవతి, కృష్ణకుమారి, గాంధీ నిధి పౌండేషన్ బాధ్యులు వై రామచంద్రరావుతో పాటు విజయవాడ నగరంలోని పలువురు ప్రముఖులు గవర్నర్ బిశ్వ భూషణ్‌తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని నేతాజీ సుబాష్ చంద్రబోస్‌కు నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments