Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లె యువతకు శుభవార్త... గ్రామ వాలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (17:53 IST)
నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పల్లె యువతుకు శుభవార్త చెప్పారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీల్లో భాగంగా, గ్రామ వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం గ్రామీణుల ముంగిటకు ప్రభుత్వ సేవలు అందించాలన్న సంకల్పంతో గ్రామ వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఈ నెల 23వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయగా, దరఖాస్తులను జూన్ 24వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన జూలై పదో తేదీ వరకు చేపడుతారు. ఇంటర్వ్యూలు మాత్రం జూలై 11వ తేదీన నుంచి 20వ తేదీన వరకు నిర్వహిస్తారు. వీరిని మండల స్థాయిలో నియమించిన కమిటీ గ్రామ వాలంటీర్లను ఎంపిక చేస్తుంది. ఎంపికైన వాలంటీర్లకు ఆగస్టు 1వ తేదీ నుంచి పది రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆగస్టు 15వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేస్తారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే యువత అదే గ్రామానికి చెందినవారై ఉండాలి. ఇంటర్‌, లేదా సమాన విద్యార్హత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ ఉంటుంది. అందులో 50 శాతం మహిళలు ఉండాలి. 2019 జూన్‌ 30వ తేదీ నాటికి 18సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తులను ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
 
ఎంపీడీవో ఛైర్మన్‌గా ఎంపీడీవో, తహసీల్దార్‌, ఈవో(పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ) కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి వలంటీర్లను ఎంపిక చేస్తుంది. ఎంపికైన వలంటీర్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే రెండు రోజులు మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఆగస్టు 15న ఎంపిక ఉత్తర్వులు అందజేస్తారు. ఆ రోజు నుంచే వారు విధులకు హాజరవుతారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో పనులు చేయాలి. వలంటీర్‌ పనిచేసే 50 ఇళ్ల యూనిట్‌ను ఎంపీడీవో కమిటీ ఎంపిక చేస్తుంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments