కుంటిసాకులు వద్దు.. జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయండి : గౌతం సవాంగ్ ఆదేశం

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (11:38 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసు తర్వాత జీరో ఎఫ్ఐఆర్ తెరపైకి వచ్చింది. అసలు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఒకటుందనే విషయం చాలా మందికి తెలియదు. దిశ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె తల్లిదండ్రులు వెళ్ళగా, పోలీసులు అనుసరించిన వైఖరితో ఇపుడు జీరో ఎఫ్ఐఆర్ అంశం తెరపైకి వచ్చింది. 
 
అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే.. పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా... పీఎస్ వచ్చిన బాధితులన ఫిర్యాదలను స్వీకరించడమే జీరో ఎఫ్ఐఆర్. ఈ తాజాగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు కుంటి సాకులు చెప్పకుండా... జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించారు. 
 
బాధితులు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వస్తుంటారని... సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటారని... అయితే, మీ ప్రాతం మా పరిధిలోకి రాదంటూ ఫిర్యాదులను స్వీకరించడానికి పోలీసులు నిరాకరిస్తుంటారని ఆయన అన్నారు.
 
తమ నివాసం ఏ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, బాధితులు అక్కడకు వెళ్లే లోపల జరగాల్సిన ఘోరాలు జరిగిపోతుంటాయని గౌతమ్ సవాంగ్ చెప్పారు. బాధితులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించారు. 
 
జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడానికి నిరాకరించేవారు ప్రాసిక్యూషన్‌కు అర్హులవుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్‌లను అమలు చేస్తామని... వారం రోజుల్లో దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేస్తామని తెలిపారు. పోలీసులు వాడుతున్న భాష సరిగా లేదనే ఫిర్యాదులు ఇప్పటికీ వస్తున్నాయని... స్పందన కార్యక్రమంతో కొంత మార్పు వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments