Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం : గౌతం సవాంగ్

Webdunia
సోమవారం, 1 జులై 2019 (16:01 IST)
ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత కుదించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ లేదన్నారు. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదన్నారు. నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే ఇచ్చామని డీజీపీ స్పష్టం చేశారు. 
 
అమరావతిలో స్పందన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ గౌతం సవాంగ్ స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. స్పందన కార్యక‍్రమం పేరుతో ప్రతి ఎస్పీ, సీపీ కార్యాలయంలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో స్పందన కార్యక్రమాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేస్తామని స్పష్టం చేశారు. 
 
శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు ప్రత్యేక హోదా ఉద్యమ కేసుల ఎత్తివేతకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే రాజకీయ దాడులపై కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. అయితే వ్యక్తిగత వివాదాలను కూడా కొంతమంది రాజకీయ ముద్రవేస్తున్నారని వాస్తవాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments