Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అప్పులు.. కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (15:24 IST)
ఏపీ అప్పులకు సంబంధించి కేంద్రానికి సమర్పించి నివేదిక వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరాల్లో అర్హతకు మించి రుణాలు ఏ రూపంలో చేసి వున్నా వాటిని మినహాయిస్తామని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. 
 
ఇప్పటికే ఏపీ వివిధ రూపాల్లో రుణాలు సమీకరించింది. వాటి సమగ్ర సమాచారాన్ని కేంద్రం కోరింది. వ్యక్తిగత కారణాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో వారం పాటు సెలవులపై వెళ్లడంతో ప్రస్తుతం ఆ శాఖలోని మరో ముఖ్య అధికారి కేంద్రం కోరిన సమాచారంతో మరో నివేదిక సిద్ధం చేశారని వార్తలు వస్తున్నారు. 
 
మరోవైపు ఏపీ అప్పులకు సంబంధించి సమగ్ర సమాచారం అందించే అవకాశం లేదని ఇప్పటికే కేంద్ర వ్యయ విభాగం ఉన్నతాధికారి సోమనాథ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇంకా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర వ్యయ నియంత్రణ విభాగానికి లేఖ రాశారు. 
 
ఇందులో విదేశీ రుణాలు, నాబార్డు , ఇతర సంస్థలు ఇచ్చిన రుణ సమాచారం కేంద్ర సంస్థల నుంచి తీసుకోవాలని సూచించారు. 
 
ప్రభుత్వ గ్యారంటీలు, ఇతర ఆస్తుల రూపంలో ప్రభుత్వం నుంచి తనఖా రూపంలో పొంది ఏయే బ్యాంకులు ఎప్పుడు ఎంత మొత్తం ఏపీ కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చాయనే వివరాలు బ్యాంకుల నుంచి తీసుకోవాలని కోరారు. ఇలా సమగ్ర వివరాలు తీసుకోకపోతే.. ఇబ్బందేనని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments