Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనితీరు బాగోలేని నేతలకు క్లాస్ పీకిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (16:50 IST)
తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఇందులో పనితీరు ఏమాత్రం బాగోలేని నేతలకు ఆయన హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా, ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం సరిగా లేదని, అందువల్ల వారికి టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఏపీ ప్రభుత్వం ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వంతో పాటు సామాజికన్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపట్టింది. వీటికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి అలెర్ట్ అయ్యారు. ఈ రెండు కార్యక్రమాలపై ఆయన ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 
 
ఈ సమీక్షలో ఆయన తాను తెప్పించుకున్న నివేదిక‌ను బ‌య‌ట‌కు తీశారు. ఈ నివేదిక‌లో ప‌లువురి ప‌నితీరు బాగానే ఉన్నా... ఓ ఏడుగురు ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ జీరోగా ఉందని చెప్పారు. ఈ ఏడుగురు ఇళ్లు క‌ద‌ల‌కుండానే... త‌మ అనుచ‌రుల‌ను పంపుతూ కార్య‌క్ర‌మాన్ని నెట్టుకొస్తున్నార‌ని సీఎం బహిర్గతం చేసినట్టు సమాచారం. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగానే వెల్ల‌డించిన జ‌గ‌న్‌... ఇలాగైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పినట్టు సమాచారం. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికే టికెట్లు ఇస్తామ‌ని జగ‌న్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: చిరంజీవి గారు అదే ఫార్మాట్‌లో తీసి సక్సెస్ అయ్యారు : ప్రియదర్శి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసింది గద్దర్ : భట్టి విక్రమార్క మల్లు

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం