అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

సెల్వి
మంగళవారం, 17 జూన్ 2025 (13:44 IST)
Kuppam Woman
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశాడు వడ్డీ వ్యాపారి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు శిరీష భర్త తిమ్మరాయప్ప. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి వెళ్లాడు తిమ్మరాయప్ప. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి. కూలీ పని చేస్తూ అప్పు కడుతోంది. 
 
అయినా అప్పు సరైన టైమ్ కట్టలేదని ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కట్టేసిన కొట్టాడు. ఇంకా ఆయన కుటుంబీకులు కూడా బాధితురాలిపై చేజేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మునికన్నప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. మునికన్నప్ప టీడీపీ కార్యకర్త అని అంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. ఇలా మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీతో సీఎం ఇప్పటికే చర్చించారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన ధృవీకరించారు. 
 
మహిళ భర్త చేసిన అప్పుల కారణంగా కుటుంబ సభ్యులు ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన విషయం గుర్తుకు వచ్చింది. స్థానికుల హెచ్చరికల మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని శిరీషను రక్షించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా అధికారులు కేసు నమోదు చేశారు. ఇంతలో, మహిళలపై ఇటువంటి హింసాత్మక చర్యలను సహించరాదని, కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments