Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగోడిని రెచ్చగొట్టొద్దు.. మాడి మసైపోతారు : చంద్రబాబు వార్నింగ్

తెలుగోడి ఆత్మగౌరవాన్ని కించపరిచి రెచ్చగొడితే మాడి మసైపోతారంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పాలకులను హెచ్చరించారు. 'రాష్ట్రంలో కొన్ని పార్టీలున్నాయి.

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:41 IST)
తెలుగోడి ఆత్మగౌరవాన్ని కించపరిచి రెచ్చగొడితే మాడి మసైపోతారంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పాలకులను హెచ్చరించారు. 'రాష్ట్రంలో కొన్ని పార్టీలున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలని వాటి నేతలు కేంద్రాన్ని అడగరు. నన్ను తిడతారు.. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా.. నన్ను తిడితే ఓట్లు పడతాయన్న ఆశతో నిద్ర లేచినప్పటి నుంచి నన్ను తిట్టడమే వాళ్ల పని' అంటూ మండిపడ్డారు. 
 
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం యర్రమంచి వద్ద గురువారం ఆయన కియ కార్ల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో కొన్ని పార్టీలున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడుగరు. నన్ను తిడతారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా.. నన్ను తిడితే వీళ్లకు ఓట్లు పడతాయని.. నిద్ర లేచినప్పటి నుంచి నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంల ఓ ఓ పేపర్‌ ఉంది. దాని పేరు చెప్పనుగానీ, అదేంటో మీకే బాగా తెలుసు. అసత్యాలు రాసీ రాసీ అలిసిపోతున్నారు. ఏమైనా లాభం ఉంటుందా తమ్ముళ్లూ అని మిమ్మల్ని అడుగుతున్నాను అని వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో క్లిష్ట సమయంలో తానైతే తప్ప మరొకరు కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరని ప్రజలు తనపై నమ్మకంతో అధికారమిచ్చారని, ఈ విషయాన్ని తాను ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్నారు. ఇకపై ఎవరికీ ఇవ్వబోమన్నారు. మనకు ప్రత్యేక సాయం చేస్తామని చెప్పారు. హోదాకు సమానంగా ప్రతిఫలం ఇస్తామన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. పైగా ఇప్పుడు వేరే రాష్ట్రాలకు హోదా పొడిగిస్తున్నారు. మరి మనకెందుకు ఇవ్వరు? ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. 
 
విభజన హామీలను, ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని కోరుతూ తాను ఢిల్లీకి 29 సార్లు వెళ్లి చర్చించానని గుర్తుచేశారు. కేంద్రం హామీ ఇచ్చిన ప్రకారం సహకరించి ఉంటే.. రెవెన్యూలోటు భర్తీ, ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. అయినా సరే తన ప్రయత్నాలతో రాష్ట్రానికి కియ లాంటి భారీ పరిశ్రమలను తీసుకొచ్చానని చెప్పారు. 2014 నాటికంటే మన పరిస్థితి మెరుగుపడిందని.. ఇందుకు తాను రేయింబవళ్లు కష్టపడుతుండడం, అధికారులు, ప్రజలు సహకరిస్తుండడమే కారణమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments