Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా దేవాన్ష్ పుట్టినరోజు .. శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ (వీడియో)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించ

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (11:10 IST)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతోపాటు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
 
దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా శ్రీవారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలకు చేరుకున్న విషయం తెల్సిందే. అనంతరం ఇక్కడి పద్మావతి అతిధిగృహంలో బసచేసి, బుధవారం ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
 
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అలాగే తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా చంద్రబాబునాయుడు తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.26 లక్షలను విరాళంగా ఇచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments