Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా? వేమూరి ఆనంద్ సూర్య

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:15 IST)
బడ్జెట్‌లో బ్రాహ్మణులకు రూ.1000 కోట్లు  కేటాయిస్తామన్నవారు ఇప్పుడేం సమాధానం చెప్తారు? మాట తప్పడం, మడమ తిప్పడం వైసీపీ నాయకుల నైజం అని మరో సారి నిరూపితమైందని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనంద్‌ సూర్య ఆరోపించారు. 
 
శుక్రవారం ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ, బ్రాహ్మణులకు రూ.1000 కోట్ల కేటాయింపులు జరుగుతాయని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో బ్రాహ్మణులకు మొండిచెయ్యి చూపింపిందని ఆరోపించారు. 
 
రూ.1000 కోట్లు కేటాయింపులు జరుగుతాయని ఊదర గొట్టిన 'వైయస్‌ఆర్‌ పార్టీ నాయకులు బ్రాహ్మణులకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? గౌరవ ఉప సభాపతిని ఈ మధ్య కాలంలో బ్రాహ్మణ సంఘాలు సన్మానించినపుడు, వారిచ్చిన హామీ రూ.1000 కోట్లు కేటాయింపులు జరుగుతాయన్నది నిజం కాదా? తప్పుడు హామీలు ఇవ్వడం వైసీపీ పార్టీ  నాయకులకు అలవాటుగా మారిపోయిందన్నారు. 
 
నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓట్‌‌ఆన్‌‌ఎకౌంట్‌ బడ్జెట్‌లోనే బ్రాహ్మణులకు రూ.100 కోట్లు కేటాయించారు. కానీ ఆ వంద కోట్లు వైసీపీ ప్రభుత్వమే కేటాయించినుట్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకులు నిజంగా మాటమీద నిలబడే వారయితే నిరుపేద బ్రాహ్మణులకు వారి నిజమైన సంక్షేమానికి రూ.1000 కోట్లు వెంటనే కేటాయింపు జరపాలని వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments