Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలి: సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (15:44 IST)
కార్యకర్తల ఆధారితంగా నిర్మాణమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, కార్యకర్తలకు శిక్షణ అనేది నిరంతర కొనసాగుతుంద‌ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. పార్టీకి  శిక్షణా కార్యక్రమమే ఒక పునాది వంటిందన్నారు.
 
 
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వివిధ జిల్లాల్లో శిక్షణ ఇచ్చే శిక్షకుల రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ సోమువీర్రాజు ప్రారంభించారు .  ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శిక్షణ పొందిన సిద్దాంతపరమైన కార్యకర్తలు కలిగిన పార్టీగా బిజెపి రాజకీయ క్షేత్రం లో పని చేస్తోంది.


నిరంతరం  చైతన్యవంతమైన వ్యవస్థను శిక్షణ ఆధారంగా పార్టీలో నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. సంచాలన సమితి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సంవత్సరం రాష్ట్ర , జిల్లా స్ధాయిల్లో శిక్షణ కొనసాగిస్తామ‌న్నారు. ఈ శిక్షణ ఆహ్లాదకరమైన వాతవరణంలో సంతోషకరంగా నిర్వహించుకోవలసిన అవసరం ఉందన్నారు. మరిచిపోని ఘట్టాలు నిక్షిప్తం చేసుకునేలా  శిక్షణా కార్యక్రమాలు జరగాలన్నారు. 
 
 
1981 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లాలో  నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో  నిక్షిప్తం చేసుకున్న ఘట్టాలు నేటికి తాను గుర్తు ఉన్నాయని సోము వీర్రాజు ఈ సందర్భంగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితే, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.


ప్రజలు భావిస్తున్నారన్న విషయాన్నిఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, నిరంతర ప్రక్రియగా జాతీయ వాదంతో  భారతీయజనతా పార్టీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ, వాజ్పేయ్, అద్వానీ, బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు లాంటి ఎంతో మంది ప్రముఖులు జాతీయ వాదాన్ని  బలంగా వినిపించడంలో దేశవ్యాప్తంగా వినిపించడంలో సఫలం అయిన సంఘటన‌లు అనేకం ఉన్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments