Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో మరో 6 నీట్ పరీక్షా కేంద్రాలు... ఎక్కడెక్కడో తెలుసా?

అమరావతి : రాష్ట్రంలో కొత్తగా ఆరు నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు కేంద్రాల్లో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నీట్ పరీక్షా కేంద్రాలు పదికి చేరుకోనున్నాయి. ద

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (15:01 IST)
అమరావతి : రాష్ట్రంలో కొత్తగా ఆరు నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు కేంద్రాల్లో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నీట్ పరీక్షా కేంద్రాలు పదికి చేరుకోనున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలు ఉండటంతో, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిని గుర్తించి, తక్షణమే రాష్ట్రంలో నీట్ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలని ఇటీవల కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, కొత్తగా ఆరు పరీక్షా కేంద్రాలను పెంచడానికి అంగీకరించిందని తెలిపారు. 
 
పరీక్షా కేంద్రాల పెంపుదలతో రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. కొత్తగా మంజూరు చేసిన కేంద్రాలను విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, చీరాల, నెల్లూరు, కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments