Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పెరిగిన కిడ్నీ పెన్షన్‌దారులు

అదనంగా చేరిన వారితో SERP అందిస్తున్న కిడ్నీ రోగుల పెన్షన్లు అక్టోబరు నెలలో మరో 215 పెరిగాయి. వీరికి ఇతర పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఈ సహాయం కొనసాగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ జులై 20వ తేదీన విడుదల చేసిన జి.ఒ. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చింది. దాంతో నిరుపేద

ఏపీలో పెరిగిన కిడ్నీ పెన్షన్‌దారులు
, గురువారం, 2 నవంబరు 2017 (18:03 IST)
అదనంగా చేరిన వారితో SERP అందిస్తున్న కిడ్నీ రోగుల పెన్షన్లు అక్టోబరు నెలలో మరో 215 పెరిగాయి. వీరికి ఇతర పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఈ సహాయం కొనసాగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ జులై 20వ తేదీన విడుదల చేసిన జి.ఒ. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చింది. దాంతో నిరుపేద కిడ్నీ రోగులకు ప్రతి నెల రూ. 2,500/ఆర్థిక సహాయం అందించడానికి ఈ ఏడాది ఆగస్టులో మార్గం సుగమమైంది.
 
ఇందుకు ‘సెర్ప్’ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించిన విషయం తెలిసినదే. దానితో సంబంధ శాఖలతో సంప్రదించిన మీదట ఆగస్టు నెల ఆర్ధిక సహాయం సెప్టెంబర్ 1 తారీఖున చెల్లించేవిధంగా ‘సెర్ప్’ చర్యలు తీసుకుంది. అయితే ఆగస్టులో 1560 మందితో మొదలయిన ఈ పెన్షన్లు అక్టోబర్ నెలలో 2,235కు పెరిగాయి. 
 
కిడ్నీ వ్యాధి స్టేజ్ 3 నుంచి 5 మధ్య ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సహాయం అందనివారు ఉన్నట్లయితే జిల్లాల్లోని సబంధిత ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అధికారిక సమ్మతి అందిన వెంటనే కొత్త పేషెంట్లకు కూడా  చెల్లించడం జరుగుతుందని సెర్ప్ సి.ఇ.ఒ. డా. పి. కృష్ణ మోహన్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్టీని గెలిపించిన వారే బాహుబలి అవుతారు: రేవంత్ రెడ్డిని అవమానించిన జానారెడ్డి?