Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మరో యూటర్న్ : శాసనమండలి రద్దు నిర్ణయ వెనక్కి?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (10:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో యూటర్న్ తీసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 
 
గతంలో శాసనమండలి రద్దు తీర్మానానికి 132 మంది వైకాపా ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ హాజరుకాక పోవడంతో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో ఆ రోజున శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. 
 
అయితే, ఈ తీర్మానాన్ని ఉపసహంరించుకుంటూ మంగళవారం ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, మరోమారు సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సీఎం జగన్ ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments