Webdunia - Bharat's app for daily news and videos

Install App

టార్గెట్ హుజూరాబాద్.... మ‌రో రూ.500 కోట్ల ద‌ళిత బంధు నిధులు!

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:42 IST)
తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీయార్ టెర్గెట్ ఇపుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌. అందుకే ఆ నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు కుమ్మ‌రిస్తున్నారు. తాజాగా మ‌రో 500 కోట్ల రూపాయ‌ల ద‌ళిత బంధు నిధులు విడుద‌ల చేశారంటే... పొలిటిక‌ల్ హీట్ ఎంత‌గా ఉందో అర్ధం అవుతోంది.
 
ద‌ళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం 2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్  ఆదేశాలు జారీ చేశారు.
మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు కు మొత్తం రూ.1,000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా, వారం రోజుల్లోపు మరో రూ.1,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.
 
ఈ నిధుల దెబ్బ‌కి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళితులంద‌రికీ కుటుంబానికి ఒక్కొకరికీ ప‌దేసి ల‌క్ష‌ల రూపాయ‌లు వ్యాపారానికి విడుద‌ల అవుతాయి. దీనితో ల‌బ్ధిదారులు మారు మాట్లాడ‌కుండా, ఎన్నిక‌ల్లో టి.ఆర్.ఎస్. నే బ‌లంగా బ‌ల‌ప‌రుస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు ఆశిస్తున్నాయి. ద‌టీజ్ ఎల‌క్ష‌న్ పాలిట్రిక్స్!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments