Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని రాందేవ్ బాబా వార్నింగ్.. మూల్యం చెల్లించక తప్పదంటూ...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యోగా గురువు బాబా రాందేవ్ గట్టివార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు.

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (09:21 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యోగా గురువు బాబా రాందేవ్ గట్టివార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ, దేశంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదన్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రభుత్వంలో ఉన్నట్టయితే పెట్రోలు, డీజిల్‌ను 35-40 రూపాయలకే ఇచ్చేవాడినన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
 
చాలా మంది ప్రజలు మోడీని విమర్శిస్తున్నారని, కానీ స్వచ్ఛ భారత్‌ వంటి మంచి కార్యక్రమాలను కూడా మోడీ ప్రారంభించారని చెప్పారు. అయితే వాక్‌స్వాతంత్ర్యం ప్రజల ప్రాథమిక హక్కని ఆయన గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments