Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి అల్లరి చేస్తుందనీ.. అగ్గిపుల్లతో ముఖంపై కాల్చిన ఆయా

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (11:29 IST)
విశాఖపట్టణంలోని ఓ అంగన్ వాడీ కేంద్రంలో పని చేసే ఓ ఆయా చేయరాని పని చేసింది. అంగన్ వాడీ కేంద్రంలో చదువుకునేందుకు వచ్చే చిన్నారుల ఆలనాపాలనా చూడాల్సిన ఆయా.. కిరాతకంగా ప్రవర్తించింది. పొద్దస్తమానం ఏడుస్తున్న ఓ చిన్నారి ఏడుపు మానిపించేందుకు అగ్గిపుల్లను వెలిగించి బుగ్గపై కాల్చి చురకలు అంటించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖపట్టణం సీతంపేట పరిధిలోని రాజేంద్రనగర్‌లోని కనకమ్మవారి వీధిలో ఓ అంగన్‌వాడీ కేంద్రం ఉంది. ఇక్కడ పలువురు చిన్నారులకు ఆటపాటలు నేర్పుతుంటారు. ఆ సమయంలో ఓ చిన్నారి అల్లరి చేస్తుండటంతో రేష్మాకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ వెంటనే అగ్గిపుల్ల వెలిగించి చిన్నారి ముఖంపై చురకలు పెట్టింది. ఈ బాధ భరించలేని ఆ చిన్నారి ఏడుస్తూ కేకలు వేయసాగింది. అయినప్పటికీ ఆయాఆ చిన్నారిని వదిలిపెట్టలేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన చిన్నారి ముఖంపై ఉన్న గాయాలను చూసిన తల్లి ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్న భవనంపైనే సీడీపీవో కార్యాలయం ఉండటం గమనార్హం. ఈ ఘటనపై స్పందించిన సీడీపీవో కార్యాలయ సూపర్‌వైజర్ స్పందించారు. బాధిత బాలిక వద్ద విచారణ జరుపుతున్నారు. నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments