మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : టీడీపీ - జనసేన డిమాండ్

వరుణ్
శుక్రవారం, 7 జూన్ 2024 (14:33 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రకు విభజన చట్టంలోని హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 16, జనసేన 2 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెల్సిందే. అదేసమయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ మెజార్టీ రాలేదు. ఆ పార్టీ కేవలం 240 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఆ కూటమి నేతగా నరేంద్ర మోడీ ఎంపికయ్యారు. దీంతో ఆయన మరోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రంలో కొత్తగా ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యంకానుంది. దీంతో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే రెండు కేబినెట్ బెర్తులు ఇవ్వాలని కోరినట్టు ఎన్డీటీవీ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. అదేవిధంగా ఈ కూటమిలో మరో కీలక పార్టీ అయిన బీహార్‌కు చెందిన జేడీయు కూడా కీలక మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తుంది. వీటిలో రైల్వే, వ్యవసాయ మంత్రిత్వ శాఖలను కోరుతుందని, భారతీయ జనతా పార్టీ మాత్రం ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోనున్నట్టు తెలుస్తుంది. దీంతో కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు అంశం ఇపుడు అమితాసక్తిగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments