Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీసర్వేలో కీలక భూమిక పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్వే అకాడమీ: సిద్దార్ధ జైన్

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (20:02 IST)
అత్యాధునిక సాంకేతిక శిక్షణల ఆలంబనగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇస్తోంది. రీసర్వే ప్రక్రియకు తోడ్పడే విధంగా ఆంధ్రప్రదేశ్ సర్వేశిక్షణా సంస్థ వివిధ అంశాలపై మూడెంచల శిక్షణను అందిస్తోంది. సాంప్రదాయక సర్వే అంశాలపై ౩౦ రోజులు, ఆధునిక సాంకేతిక విధానాలపై మరో ౩౦ రోజులు, క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష సర్వే అంశాలపై ఇంకో నెలరోజులు ఇలా మూడు నెలల పాటు పూర్తి స్థాయి శిక్షణలను అందించి రీసర్వే ప్రాజెక్టుకు అవసరమైన మానవ వనరులను సిద్దం చేస్తున్నారు. దశల వారిగా భూసర్వే జరుగుతున్న నేపధ్యంలో శిక్షణలను సైతం అదే క్రమంలో చేపడుతున్నారు. రీ-సర్వే కోసం ప్రభుత్వం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికతతో పాటు డ్రోనులు, కార్స్ నెట్వర్క్ ఉపయోగిస్తుంది. ఈ క్రమంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ రెవిన్యూ  గ్రామానికి ఒకరు వంతున 10,185 మంది గ్రామ సర్వేయర్లను నియమించారు.

 
కేవలం సర్వే శాఖకు సంబంధించిన సిబ్బందికే కాక, రెవిన్యూ శాఖలో అసిస్టెంట్ కలెక్టర్ స్థాయినుండి గ్రామ రెవిన్యూ అధికారి స్థాయి వరకు వివిధ స్థాయిలలో శిక్షణ చేపడుతున్నారు. పురపాలక, నగర పాలక సంస్థలలో సైతం ఆస్తుల సర్వే కొరకు వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. భారత సర్వే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఫలితంగా వారి హైదరాబాద్ కేంద్రంలో జాతీయ స్థాయి శిక్షణలు అందించటం ప్రత్యేకత కాగా, శిక్షణ పొందిన అభ్యర్థుల ప్రతిభను అంచనా వేస్తూ వారికి పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. వీరందరికీ శిక్షణ అందించే క్రమంలో ఇటిఎస్, డిజిపిఎస్, జిఎన్ఎస్ ఎస్ నెట్వర్క్ రోవర్స్, కార్స్, డ్రోన్స్ సాంకేతికత అంశాలపై సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు.

 
మరోవైపు ఆటో క్యాడ్, ఎఆర్సి జిఐఎస్, క్యూజిఐఎస్ లలో సైతం నూతన సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు. ప్రతి కాలండర్ సంవత్సరంలో సుమారు 1500 మందికి వివిధ సర్వే అంశాలలో అంద్రప్రదేశ్ సర్వే శిక్షణా సంస్థ  ద్వారా శిక్షణ పొందుతున్నారు. నూతన రాష్ట్రం  ఏర్పడిన తరువాత సర్వే శిక్షణా సంస్థ తాత్కాలికంగా తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ఏర్పాటుకాగా, పూర్తి స్థాయిలో అత్యాధునిక హంగులతో శాశ్వత శిక్షణా సంస్థను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారని సంస్ధ ప్రిన్సిపాల్, సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ సిద్దార్ధ జైన్ తెలిపారు.

 
చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో 41.19 ఎకరాల భూమిని కేటాయించగా, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. భూముల రీసర్వే నేపధ్యంలో శిక్షణ అంశాలకు సంబంధించి పలు మార్పులకు సైతం సిద్దార్ధ జైన్ శ్రీకారం చుట్టారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నిర్వహించే పరీక్షలలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఓఎంఆర్ జవాబు పత్రాలు, జబ్లింగ్ సీటింగ్ విధానం అమలు చేస్తున్నారు. రీసర్వేలో భాగముగా ఏర్పాటైన మొబైల్ మేజిస్ట్రేట్ వ్యవస్థ  కోసం నల్సార్ విశ్వ విద్యాలయంలో  డిప్యూటీ కలెక్టర్లు, తహసిల్దార్లు, డిప్యూటీ  తహసిల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ తదితర అధికారులకు న్యాయ విద్యకు సంబంధించి అంశాలలో ప్రత్యేక శిక్షణలు అందించే ఏర్పాటు చేసారు. మరోవైపు ఎపిపిఎస్సి ద్వారా నియామకమైన డిప్యూటీ తహసిల్దార్లకు ఆధునిక సర్వే పద్ధతులలో శిక్షణ ఇప్పించడంతో పాటు, డిపార్టుమెంటు పరిక్షలలో సిలబస్ ను ఎప్పటికప్పుడు పునర్ వ్యవస్ధీకరిస్తూ నూతన అంశాలను జత చేస్తున్నారు. డ్రోన్ పైలట్ సర్వేలో 94మంది  శిక్షణ పూర్తి చేసుకోగా, అయా జిల్లాలలో డ్రోన్ పైలట్, కో పైలట్ రూపంలో వీరి సేవలు వినియోగిస్తున్నారు. మండల స్దాయిలో ఒక మాస్టర్ ట్రైనర్ అందు బాటులో ఉండేలా 679 మంది గ్రామ సర్వయర్లకు క్యూజిఐఎస్ సాప్ట్వేర్‌ను ఉపయోగించి ఎల్ పిఎం, గ్రామపటం తయారీలో శిక్షణ పూర్తిచేసారు. రీసర్వే ప్రాజెక్టులో ప్రధానమైన గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ లో ప్రతి మండలానికి ఒక  ట్రైనర్  అందుబాటులో ఉండేలా 679 మంది గ్రామ సర్వయర్ల శిక్షణ పూర్తి చేసారు.

 
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్వే అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్ విఎస్ఎన్ కుమార్ మాట్లాడుతూ సర్వే శాఖ పునర్ వ్యవస్ధీకరణలో భాగంగా జిఓ 323 ద్వారా పదోన్నతులు పొందిన అధికారులకు కూడా కమీషనర్ సిద్దార్ధ జైన్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు పునశ్చరణ తరగతులను అందిస్తున్నామన్నారు. తాజాగా అకాడమీలో రెండువిడతలుగా సర్వే శిక్షణ పూర్తిచేసుకున్న రెవిన్యూ సబార్దినెట్ లలో ఈ నెల 24 నుండి మల్టీ  జోన్1 అభ్యర్దులకు, జూలై 31 నుండి ముల్టీ జోన్2  అభ్యర్దులకు  విజయవాడలో థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 7వ సర్వే ట్రైనింగ్ బ్యాచ్లో  ఫెయిల్ అయిన అభ్యర్దులకు కూడా పరిక్షలు చేపట్టనుండగా,  మొత్తం 1208 మంది అభ్యర్దులకు థియరీ, ప్లాటింగ్ తో పాటు ప్రాక్టికల్  పరిక్షలు కూడా ఆయా జిల్లాలలో జాయింట్ కలెక్టర్ ల  పర్య వేక్షణలో జూలై  25 నుండి 30 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్టు పూర్తి చేసామని సిహెచ్ విఎస్ఎన్ కుమార్ వివరించారు. గతంలో గ్రామ సహాయకులుగా పనిచేసి, పదోన్నతి ద్వారా గ్రేడ్2 గ్రామ రెవిన్యూ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న 3846 మందికి  ప్రొబేషన్  ప్రకటించ వలసి ఉండగా, వారికి అవసరమైన 15 రోజుల శిక్షణను అకాడమీ దశలవారీగా చేపట్టింది. శిక్షణా అనంతరం సెప్టెంబర్ నెలలో వీరికి పరిక్షలు నిర్వహించనుండగా, అకాడమీ ట్రైనింగ్ క్యాలండర్ ప్రకారము రెవిన్యూ అధికారులకు నిర్వహించ వలసిన సర్వే మెయింట్ నెన్స్ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించేందుకు  అకాడమి  చర్యలు  తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం