Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై డిగ్రీ కోర్సుల్లో స్కిల్ డెవలప్‌మెంట్.. ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి...

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (16:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల సిలబస్ మారనుంది. డిగ్రీ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ సిలబస్‌ను 2020-21 నుంచి అమలు చేయనున్నారు. 
 
సాధారణంగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి సిలబస్ మారుతుంది. గతంలో 2015-16లో సిలబస్ మార్చారు. ఇపుడు అంటే ఐదేళ్ల తర్వాత మరోసారి మార్పులకు రంగం సిద్ధమవుతోంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. 
 
రాష్ట్రంలోని వర్సిటీలకు అనుబంధంగా ఉన్న అన్ని డిగ్రీ కాలేజీల్లో మార్పులు అమలు చేస్తారు. ఇప్పటికే అమల్లో ఉన్న చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం(సీబీసీఎ్‌స)లో భాగంగా డిగ్రీ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి(స్కిల్‌ డెవల్‌పమెంట్‌)కి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. 
 
మూడేళ్ల రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులైన బీకాం, బీఎస్సీ, బీఏలతో పాటు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ను చేసేందుకు విద్యార్థులకు అవకాశం కలగనుంది. డిగ్రీతో సమాంతరంగా ఈ కోర్సును ఎంచుకునే విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయడాన్ని తప్పనిసరి చేయబోతున్నారు.
 
ఈ దిశగా డిగ్రీ సిలబస్‌లో మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. డిగ్రీ చదువుతూనే.. తనకు ఆసక్తి ఉన్న స్కిల్స్‌పై సదరు విద్యా సంస్థలో అందుబాటులో లేకుంటే మరో కాలేజీ లేదా విద్యా సంస్థలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సు చేసేందుకు వెసులుబాటు కల్పించే విషయమై చర్చ జరుగుతోంది. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments