Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌ లోకి డెల్టా ప్లస్ కేసు.. థర్డ్ వేవ్‌తో జాగ్రత్త..

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (18:08 IST)
కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు వచ్చిందని చెప్పారు.
 
అయితే అతడి నుంచి ఎవరికీ వైరస్ వ్యాపించలేదని మంత్రి అన్నారు. బాధితుడికి సరైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ వేరియంట్ల కేసుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితులు ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ సడలింపులపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.
 
కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. సమావేశంలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments