Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విలయ తాండవం.. శ్రీకాళహస్తిలో లాక్ డౌన్

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (23:07 IST)
ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరణ మృందంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 9 వేల 881 మందికి కరోనా సోకింది. 51 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 74 వేల 041 శాంపిల్స్ పరీక్షించారు.
 
చిత్తూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, విశాఖపట్టణంలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు చనిపోయారు.
 
గడిచిన 24 గంటల్లో 4 వేల 431 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 1,60,68,648 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం 10,40,546 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 37 వేల 679 మంది డిశ్చార్జ్ కాగా..7 వేల 736 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.
 
శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. శ్రీకాళహస్తిలో కరోనా తీవ్రత నేపథ్యంలో మంగళవారం నుంచి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాస్ ప్రకటించారు. 
 
అయితే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ కాకుండా కొంత సడలింపులిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలకు అనుమతి ఇచ్చారు. ఈ తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని శ్రీనివాస్ ప్రకటించారు.
 
ఇప్పటికే మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు తిరుపతిలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ బోర్డు సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ఏ ఆలయంలోనూ తీర్థప్రసాదాలు ఇవ్వకూడదని కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments