Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి ఇకపై వారికి నో ఎంట్రీ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు నో ఎంట్రీ అంటూ స్పష్టంచేసింది. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మెమో జారీచేశారు. 
 
ఈ కార్యాలయాల్లో అవినీతి పెరగడగానికి ప్రధాన కారణం అనధికార వ్యక్తులేనని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇటీవల పేర్కొంది. దీంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని తెలిపింది. 
 
ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని, అందుకే అనధికార వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఐజీ ఆదేశాలపై డాక్యుమెంట్ రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments