Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోంమంత్రిగా నాడు సబిత.. నేడు సుచరిత : మంత్రులకు శాఖలు ఇవే.. డిప్యూటీ సీఎంలు వీరే..

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (16:40 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మంత్రవర్గంలో 25 మంది మంత్రులు కొలువుదీరారు. వారితో గవర్నర్ నరసింహన్ శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదాను కల్పించారు. అలాగే, మంత్రులందరికీ శాఖలను కూడా కేటాయించారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి హోదాను ఐదుగురు మంత్రులకు కేటాయించారు. వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, కె. నారాయణ స్వామి, అంజాద్ బాషా, ఆళ్ళ నాని, పుష్ప శ్రీవాణిలు ఉన్నారు. మరోవైపు, జగన్ మోహన్ రెడ్డి కూడా హోంశాఖను ఓ మహిళకు కేటాయించారు. గతంలో కూడా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోంశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించిన విషయం తెల్సిందే. ఇపుడు కూడా సీఎం జగన్ హోం శాఖను మహిళకు కేటాయించడం గమనార్హం. మంత్రిత్వ శాఖల కేటాయింపు ఇలా ఉంది. 
 
1. మేకతోటి సుచరిత : హోంశాఖ
2. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి : ఆర్థిక శాఖ
3. పెద్దిరెడ్డి రాచమంద్రా రెడ్డి : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖ. 
4. పాముల పుష్పశ్రీవాణి : గిరిజన సంక్షేమం
5. బాలినేని శ్రీనివాస్ రెడ్డి : విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ. 
6. పిల్లి సుభాష్ చంద్రబోస్ : రెవెన్యూ, రిజిస్ట్రేషన్
7. ఆళ్ళ నాని : వైద్య ఆరోగ్యం, కుటుంబ సక్షేమం. 
8. వెల్లంపల్లి శ్రీనివాస్ : దేవాదాయ శఖ
9. చెరుకువాడ శ్రీరంగనాథ రాజు : గృహ నిర్మాణ శాఖ 
10. ధర్మాన కృష్ణదాస్ :  రోడ్లు, భవనాల శాఖ
11. బొత్స సత్యనారాయణ : మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
12. అవంతి శ్రీనివాస్ :  పర్యాటక శాఖ, కల్చరల్ శాఖ. 
13. మేకపాటి గౌతంరెడ్డి : పరిశ్రమలు, వాణిజ్యశాఖ
14. అనిల్ కుమార్ యాదవ్ : జలవనరుల శాఖ
15. కురసాల కన్నబాబు : వ్యవసాయం, సహకార శాఖ. 
16. తానేటి వనిత : మహిళా శిశుసంక్షేమం
17. కొడాలి నాని : పౌరసరఫరాల శాఖ
18. మోపిదేవి వెంకటరమణ : పశుసంవర్ధకశాఖ
19. పినిపె విశ్వరూప్ : సాంఘిక సంక్షేమ శాఖ
20. గుమ్మన జయరాం : కార్మిక, ఉపాధి శాఖ. 
21. శంకర నారాయణ : బీసీ సంక్షేమం
22. ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమం. 
23. పేర్ని నాని : రవాణా, సమాచార శాఖ. 
24. ఆదిమూలపు సురేష్ : విద్యాశాఖ 
25. నారాయణ స్వామి : ఎక్సైజ్, వాణిజ్య పన్నులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments