Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతాలే ఇచ్చేందుకే గతిలేదు... త్రీ క్యాపిటల్స్ అవసరమా? జగన్ గారూ : వైకాపా ఎంపీ

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:48 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి చెందిన అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకే డబ్బులు లేవని, ఇపుడు మూడు రాజధానులు అవసరమా? సీఎం జగన్ గారూ అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. 
 
పాలనావికేంద్రీకరణ పేరుతో 13 జిల్లాలకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ గట్టి సంకల్పంతో ఉన్న విషయం తెల్సిందే. దీనిపై వైకాపా ఎంపీగా ఉన్న రాజు గత కొన్ని రోజులుగ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని... ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మార్పు అవసరమా? అని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోవడం సరికాదని అన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. రాజధాని గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదన్నారు. 
 
అమరావతిలో రాజధాని వస్తుందని దాచుకున్న సొమ్ముతో మధ్యతరగతి ప్రజలు భూములు కొన్నారని రఘురాజు చెప్పారు. వారికి అన్యాయం చేయొద్దని కోరారు. అమరావతికి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని హైకోర్టు ఆదేశించడం మంచి పరిణామమన్నారు. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ రెఫరెండంకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
 
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ వంటి వ్యక్తులను కూడా బెదిరిస్తున్నారని రఘురాజు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులు తనకు కూడా ఎదురయ్యాయని చెప్పారు. న్యాయ వ్యవస్థపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని... దీనివల్ల ప్రభుత్వానికే అపారమైన నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments