Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగళ్లు కేసులో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (11:37 IST)
చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘర్షణ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. పైగా, రెండు షూరిటీ బాండ్లు ఇవ్వాలని ఆదేశించింది. 
 
ఈ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో తీవ్ర స్థాయిలో వాదనలు ఆలకించిన తర్వాత తీర్పును రిజర్వు చేసి, శుక్రవారం తీర్పును వెలువరిస్తారమని తెలిపింది. ఆ ప్రకారంగా శుక్రవారం ఉదంయం తీర్పును వెలువరిస్తూ, ముందస్తు బెయిల‌్‌ను మంజూరు చేసింది. 
 
సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం చంద్రబాబు బస్సు టూర్ చేపట్టారు. చిత్తూరు జిల్లా అంగళ్ళులో ఆయన పర్యటిస్తుండగా, అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగపడ్డారు. ఈ కేసులో స్తానిక పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. 
 
ఇందులో ఏ1గా చంద్రబాబు ఉండగా, మరో 179 టీడీపీ కార్యకర్తలు, నేతలు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో దాదాపు అందరికీ బెయిల్ వచ్చింది. ఇపుడు చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
చంద్రబాబుకు అలర్జీ సమస్య  : రాజమండ్రి జైలు డిఎస్పీ 
 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అలెర్జీ సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారని రాజమండ్రి డిప్యూటీ సూపరింటిండెంట్ రాజ్ కుమార్ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉక్కపోత, అధిక వేడిమి ఉన్న కారణంగా డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. దీంతో స్కిన్ స్పెషలిస్ట్‌లను పిలిపించారమని ఆయన వెల్లడించారు. విపరీతమైన ఉక్కపోత, అధిక వేడిమి కారణంగానే ఆయన డీహైడ్రేషన్‌కు గురికావడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. 
 
తనకు అలర్జీ సమస్య ఉదంని చంద్రబాబు చెప్పడంతో స్కిల్ స్పెషలిస్టులను పిలిపించామని తెలిపారు. వైద్యులు చంద్రబాబును పరీక్షించారని, చంద్రబాబుకు అలర్జీ సమస్య ఉందని వారు గుర్తించారని చెప్పారు. చంద్రబాబుకు కొన్ని మందులు సూచించారని, వైద్యులు సూచించిన మందులను చంద్రబాబుకు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.
 

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments