అగ్నిగుండంలా ఆంధ్రప్రదేశ్.. నేడు రేపు వడగాడ్పులు...

Webdunia
ఆదివారం, 28 మే 2023 (09:15 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సూర్యతాపంతో ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఏపీ అగ్నిగుండంలా మారింది. అనేక ప్రాంతాల్లో పగడి ఉష్ణోగ్రతలు ఏకంగా 44 డిగ్రీలు దాటేశాయి. శనివారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లె మండలం చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం 35 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం 12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 
 
అధికంగా గుంటూరులో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్‌ జిల్లాలో 10 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments