Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు వీరే... 20 మంది మంత్రులు..

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (12:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకానుంది. శనివారం ఉదయం 11.29 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహం ప్రమాణం చేయిస్తారు. అయితే, జగన్ తన మంత్రివర్గాన్ని 25 మందితో ఏర్పాటు చేయనున్నారు. వారిలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు కాగా, 20 మంది మంత్రులుగా ఉంటారు. 
 
ఉప ముఖ్యమంత్రులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రలుగా ప్రమాణం చేసే వారిలో ఈ ఐదుగురు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంజాద్‌ బాషా(మైనార్టీ), సుచరిత(ఎస్సీ), ఆళ్ల నాని(కాపు), పార్థసారథి(యాదవ), రాజన్న దొర(ఎస్టీ)ను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. 
 
మంత్రివర్గంలో 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్‌ తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తాం. అప్పుడు కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు జగన్‌. మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఏపీ అసెం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానంలో గెలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments