Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో విడత నాడు - నేడు : తూగో జిల్లాలో సీఎం జగన్ టూర్

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (13:44 IST)
మలిదశ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. 
 
అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బె​స్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్‌ విద్యార్థులతో మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను సీఎం జగన్‌కు వివరించారు.
 
ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా విద్యార్థులను అడిగి తెలసుకొని.. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్‌ బ్యాగ్‌ను భుజనా వేసుకొని మరీ సీఎం జగన్‌ పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించిన ‘మెనూ’ను సీఎం జగన్‌ పరిశీలిచారు. అనంతరం ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్‌ ఆవిష్కరించి సీఎం జగన్‌ ప్రారంభించారు.
 
ఇదిలావుంటే, ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్‌ జగన్‌ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్‌ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

రివాల్వర్ రీటా గా కీర్తి సురేశ్‌ - రైట్స్ దక్కించుకున్న రాజేష్ దండా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments