Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ విద్యాబోధన

Webdunia
శనివారం, 23 జులై 2022 (14:51 IST)
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ విద్యాబోధన చేపట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. 
 
ఈ విద్యా సంవత్సరంలో సెప్టెంబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లు నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బైజూస్‌ కంటెంట్‌ ద్వారా విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు. 
 
విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు డిజిటల్ విధానాన్ని తీసుకువస్తున్నామని జగన్ తెలిపారు. ఇందుకోసం నాణ్యమైన డిజిటల్‌ పరికరాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారు. స్మార్ట్‌ బోధన సదుపాయాల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని వివరించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments