Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తింటే కరోనా మాయమంటూ ప్రచారం.. కొండెక్కిన ధరలు!

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (09:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ పది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ వాలుసుల బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో చికెన్ ఆరగిస్తే కరోనా మాయమైపోతుందనే ప్రచారం సాగుతోంది. దీంతో అనేక మంది చికెన్ కోసం ఎగబడుతున్నారు. ఈ కారణంగా చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చొన్నాయి. 
 
వాస్తవానికి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు జనం వివిధ రకాలైన ఆహారపదార్థాలను తీసుకుంటున్నారు. ఇలాంటివాటిలో కోడి మాంసం, గుడ్డు వినియోగం పెంచారు. అయితే అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. దీనికితోడు చికెన్‌తో కరోనా చెక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
మరోవైపు, లాక్డౌన్‌ సమయంలో కొన్ని పౌల్ట్రీ కంపెనీలు మూసివేశారు. మరికొన్ని ఉత్పత్తి తగ్గించాయి. రైతులు 80 శాతం వరకు కోళ్ల పెంపకానికి స్వస్తి పలికారు. దీంతో చాలా ఫారాల్లో కోళ్లు లేవు. మరికొన్నిచోట్ల అరకొరగా మాత్రమే వుండడంతో కొరత వచ్చింది. ప్రస్తుతం వున్న మార్కెట్‌ డిమాండ్‌కు కోళ్లు సరిపోవడం లేదు. 
 
ఇలాంటి అనేక కారణాల కారణంగా.. చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కాగా, గురువారం మార్కెట్‌లో విత్‌ స్కిన్‌ కిలో రూ.224, స్కిన్‌లెస్‌ రూ.234గా నిర్ణయించారు. ఈ వారాంతానికి ధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం మరో 15 రోజులకుగానీ కోళ్ల సరఫరా పెరగదని చెబుతున్నారు. 
 
అయితే కరోనా వైరస్‌ వల్ల చికెన్‌ వినియోగం పెరిగినందున, రానున్న పక్షం రోజుల్లో సరఫరా పెరిగినా డిమాండ్‌ను తగ్గట్టు అందించడం కష్టమేనని కోళ్ల రైతు ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా వల్ల చికెన్‌ అమ్మకాలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments