Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది ప్రజాస్వామ్యమా? కాలకేయ రాజ్యమా? చంద్రబాబు ప్రశ్న

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (16:17 IST)
వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ సూటి ప్రశ్న సంధించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతుందా లేక కాలకేయ రాజ్యమా అంటూ నిలదీసారు. 
 
వైసీపీ అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఏమిటీ నిరంకుశత్వమంటూ నిలదీశారు. ఇది నాగరిక రాజ్యమా? కాలకేయ రాజ్యమా? అంటూ ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారు? 
 
ఇంతకుముందు మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా?" అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments