అనకాపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు... అనేక రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (18:43 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళుతున్న ఈ రైలు తాడి - అనకాపల్లి మార్గంలో పట్టాలు తప్పింది. మొత్తం ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన కారణంగా ట్రాక్ దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో నడిచే అనేక ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. 
 
రద్దు చేసిన రైళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి గుంటూరుకు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో పాటు రత్నాచల్ - ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అలాగే, గుంటూరు నుంచి విశాఖ వైపు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 
 
విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలును మాత్రం మూడు గంటలు ఆలస్యంగా నడిపిస్తున్నారు. మరోవైపు, రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments