Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్నాథ్ యాత్రలో విషాదం - ఏపీ భక్తురాలు మృతి

Webdunia
సోమవారం, 11 జులై 2022 (15:06 IST)
పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఆకస్మికంగా వర్షాలు కురవడంతో ఆ కారణంగా వరదలు వచ్చాయి. దీంతో అనేక మంది గల్లంతుకాగా, రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉండగా, వీరిలో ఒకరైన గుణశెట్టి సుధ (48) చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. 
 
గత రెండు రోజులుగా గాలింపు కొనసాగిస్తున్న నేపథ్యంలో సోమవారం శ్రీనగర్‌లోని ఆస్పత్రి మార్చురీలో సుధ మృతదేహాన్ని గుర్తించామని వారు వెల్లడించారు. మృతురాలు రాజమహేంద్రవరంలోని కుమారి టాకీస్‌ ప్రాంతానికి చెందినవారు. ఆమె మృతితో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మరో మహిళ పార్వతి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా నుంచి 82 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని కలెక్టర్‌ తెలిపారు. వీరిలో 57 మంది సురక్షితంగా ఉండగా.. మరో 25 మంది ఆచూకీ తెలియాల్సి వుందన్నారు. ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments