Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ రూ.18 వేలతో ఐఏఎస్ అధికారి కుమారుడు వివాహం... నిజమా?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (10:52 IST)
సాధారణంగా ఇంట్లో ఓ చిన్న ఫంక్షన్ చేయాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సిందే. అలాంటిది తన కుమారుడు పెళ్లిని కేవలం రూ.18 వేలతో పూర్తి చేయనున్నారో ఐఏఎస్ అధికారి. నిజానికి ఐఏఎస్ అధికారి ఇంట్లో పెళ్లి అంటే హంగూ ఆర్భాటాలకు ఏమాత్రం కొదవు ఉండదన్న విషయం తెల్సిందే. కానీ, ఈ అధికారి ఇంట్లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి (వీఎంఆర్డీఏ)లో కమిషనరుగా బసంత్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి పని చేస్తున్నారు. ఈయన తన కుమారుడు వివాహాన్ని ఈనెల 10వ తేదీన చేయనున్నారు. ఈ పెళ్లి ఖర్చు మొత్తం రూ.36 వేలు. ఇందులో ఈ అధికారి వాటా రూ.18 వేలు. 
 
ఈ వివాహాన్ని అత్యంత సాదాసీదాగా చేయాలని చేయాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. విశాఖలోని దయాల్‌నగర్‌లో సత్సంగ్ ఆధ్వర్యంలో వివాహం జరగనుంది. పెళ్లి ఖర్చు మొత్తం రూ.36 కానుండగా, ఇందులో సగం ఖర్చు అంటే రూ.18 వేలు అమ్మాయి తల్లిదండ్రులు భరించనున్నారు. 
 
సాదాసీదా కుటుంబాలే ఈరోజుల్లో ఆడంబరంగా పెళ్లిళ్లు జరిపిస్తుంటే.. ఓ ఐఏఎస్ అయి ఉండి తన కుమారుడి పెళ్లిని ఇంత సింపుల్‌గా పెళ్లి జరిపిస్తుండటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే ఐఏఎస్ అధికారి తన కుమార్తె వివాహాన్ని కేవలం రూ.16,100 ఖర్చుతోనే జరిపించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments