Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ పార్టీలకు వాట్సాప్ స్ట్రాంగ్ వార్నింగ్

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (10:21 IST)
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఎన్నికల బరిలోకి దిగుతున్న భారత రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతున్నాయి. ముఖ్యంగా చాలామంది రాజకీయ నేతలు, పార్టీలు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలను ప్రచార అస్త్రాలుగా వుపయోగిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాట్సాప్‌ను కొన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వాట్సాప్ సంస్థకు చెందిన అధికారి కార్ల్ వోగ్ మాట్లాడుతూ.. వాట్సాప్ సేవలను దుర్వినియోగం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 
 
కొన్ని రాజకీయ పార్టీలు వాట్సాప్‌ను మంచి పనుల కోసం ఉపయోగించాలే తప్ప.. కొన్ని పార్టీల మేలు కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. కారణం ఏదైనా.. వాట్సాప్‌ను స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసే రాజకీయ పార్టీలను చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
ఈ హెచ్చరికలను పట్టించుకోకపోతే.. వాట్సాప్ సేవలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ హెచ్చరికలను రాజకీయ పార్టీలు పట్టించుకుంటాయా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments