Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతే రాజు.. అలాంటి రైతుకు మేలు జరగాలన్నదే లక్ష్యం : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:50 IST)
రైతే రాజు అని, అలాంటి రైతుకు అన్ని విధాలుగా మేలు జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిస్సాన్ పథకం కింద జమ చేసే నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి శుక్రవారం బదిలీ చేశారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రైతు భరోసాకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత ఉన్న రైతులు మరో నెల రోజుల వరకైనా నమోదు చేసుకోవచ్చన్నారు. 
 
మేనిఫెస్టోలో ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నామన్నారు. ముందుగా చెప్పిన దానికంటే ఎక్కువగా రూ.13,500 ఇవ్వగలుగుతున్నామన్నారు. పెట్టుబడి సాయంతో రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉందన్నారు. 
 
మేలోనే రూ.7,500 ఇవ్వాలనుకున్నాం.. కానీ కరోనా కారణంగా ఏప్రిల్‌లో రూ.2 వేలు ఇచ్చామని తెలిపారు. జూన్‌ పంటకు సన్నద్ధమయ్యేందుకు పెట్టుబడి కోసం రూ.5,500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అటవీ ప్రాంతంలో భూములు సాగుచేసుకుంటున్న వారికి రైతు భరోసా అందుతుందని స్పష్టంచేశారు. 
 
సంక్రాంతి వేళ మూడో విడతగా మరో రూ.2 వేలు అందిస్తామని వివరించారు. రైతు భరోసాకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నది మా ప్రభుత్వం లక్ష్యం. కులాలు, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరుతుంది. రైతుల పాత అప్పులకు జమ కాకుండా నగదు అందిస్తున్నాం. బ్యాంకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే 1902కు ఫోన్‌ చేయవచ్చు. రైతుకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పని చేస్తోందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments