Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం కోసం అంతా చేస్తున్న పవన్ కల్యాణ్.. మినీ కాశీ కోసం..?

సెల్వి
బుధవారం, 8 మే 2024 (15:44 IST)
జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు వంగగీతపై పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ సర్వశక్తులు ఒడ్డుతుండడంతో కాకినాడ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం హోరాహోరీ పోరు సాగనుంది.
 
తెలుగుదేశం పార్టీ (టిడిపి), భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో ఎన్నికల పొత్తును కలిగి ఉన్న పవన్ అసెంబ్లీకి రానున్న ధీమాలో వున్నారు. ఇక కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎంపీ వంగ గీతను బరిలోకి దింపింది. 
 
కాకినాడ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పిఠాపురం ఒకటి. ఇక్కడ పవన్ ఒకటిన్నర నెలలకు పైగా పిఠాపురంలో రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గానికి పరాయి వ్యక్తిగా కాకుండా.. తన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ పట్టణంలో ఇల్లు కొనుక్కొని ప్రజలకు చేరువగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. 
 
దేశంలోని 18 శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతిక దేవాలయంతో పాటు పురాతన కుక్కుటేశ్వర ఆలయాన్ని ‘మినీ కాశీ’గా అభివృద్ధి చేయడంతో పాటు రూ.300 కోట్లతో నియోజకవర్గంలో ఆలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని జనసేన అధినేత హామీ ఇచ్చారు. 
 
మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments