Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త మర్మావయవాలు నులిమి చంపేసిన భార్య...

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:11 IST)
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితోపాటు మరోవ్యక్తితో కలిసి హత్య చేసింది. పైగా, ఈ నేరం తనపైకి రాకుండా అనుమానాస్పద కేసుగా చిత్రీకరించింది. చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం నిజం వెల్లడైంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా ఓడీ చెరువు మండల కేంద్రానికి చెందిన తంబాల పెద్ద ఆదెప్ప(35) అనే వ్యక్తి ఓ తాగుబోతు. ఈయన భార్య రమాదేవి అదే గ్రామానికి చెందిన మంజునాథ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆదెప్పకు తెలియడంతో నిత్యం భార్యతో గొడవపడుతూ వచ్చేవాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించాలని ప్రియుడు మంజునాథ్‌తో కలిసి పథకం రచించింది. ఇందుకోసం చరణ్ అనే వ్యక్తి సాయం తీసుకున్నారు. 
 
ఈ ముగ్గురు కలిసి ఈనెల 18వ తేదీ రాత్రి సోమవారం మద్యం సేవిద్దామని చెప్పి పెద్ద ఆదెప్పను మండల కేంద్రంలోని చెరువులోకి పిలుచుకెళ్లి.. పీకలవరకు మద్యం సేవించాడు. అక్కడకు మంజునాథ్, రమాదేవి అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న పెద్ద ఆదెప్పను ముగ్గురూ కలిసి గొంతు, మర్మావయవాలు నులిమి చంపేశారు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి చేరుకున్నారు. 
 
ఆ తర్వాత మృతులు సోదరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో అసలు విషయం వెల్లడైంది.  నిందితుల్ని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments