కృష్ణపట్నంలోని తన నివాసానికి వచ్చిన ఆనందయ్య

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:32 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని తన నివాసానికి ఆనందయ్య వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ నేతలు కలిశారు. ఆనందయ్య కోసం పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఆనందయ్యను పోలీసులు మరో చోటుకు తీసుకెళ్లే అవకాశం‌ ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఆనందయ్య ఇస్తున్న కరోనా మందును ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత ఆనందయ్య కూడా కనిపించుకుండా పోయారు. అయితే ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి కనుసన్నల్లోనే రహస్య ప్రాంతంలో ఆనందయ్య ఉన్నట్టు ప్రచారం జరిగింది.

ఆనందయ్య చుట్టూ పోలీస్‌ వలయం ఉంది. ఆనందయ్యను కనీసం బంధువులతో కూడా పోలీసులు మాట్లాడనివ్వడం లేదు. కృష్ణపట్నంలో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి. బయట ప్రాంతాల వారిని పోలీసులు అనుమతించడం లేదు. 
 
అయితే ఇంతకుముందు ఆనందయ్య వీడియో ద్వారా ఓ సందేశాన్ని పంపారు. టీవీల్లో, వాట్సాప్‌లలో కరోనాకు మందు శుక్రవారం ఇస్తున్నారని ప్రకటనలు చేస్తున్నారని అవన్ని అబద్దాలని, వాటిని నమ్మొద్దని తెలిపారు. మందు తయారు చేయడం నిలిపివేశామని, మందు తయారు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు.

పర్మిషన్ ఇచ్చిన వెంటనే మందు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తాన్నారు. ప్రస్తుతం మందు తయారీకి తనవద్ద వనమూలికలు, ద్రవ్యాలు లేవన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తాను టీవీ ప్రకటన చేసి.. మందు తయారు చేసి అందరికీ సరఫరా చేస్తానని ఆనందయ్య స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments