Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం చెప్పేవరకు ఎవరూ కృష్ణపట్నం రావొద్దు.. స్పందించిన ఆనందయ్య

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (16:39 IST)
కరోనాపై తన ఆయుర్వేద ఔషధంపై జరుగుతున్న ప్రచారం పట్ల నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య స్పందించారు. తన ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి పంపిణీ పునఃప్రారంభం అంటూ వస్తున్న వార్తలను కూడా నమ్మవద్దని వివరించారు.
 
ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మందు పంపిణీ చేస్తానని, అయినా తనవద్ద ఇప్పుడు మూలికలు తగినంత స్థాయిలో లేవని ఆనందయ్య వెల్లడించారు. తాము ప్రకటించేవరకు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చాక, తొలుత మూలికలు సేకరించుకోవాల్సి ఉందని, ఆ తర్వాతే మందు తయారీ, పంపిణీ అని వెల్లడించారు.
 
ఇకపోతే, ఆనందయ్య మందు శాస్త్రీయతపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో, ఆయుష్ శాఖ రంగంలోకి దిగి ఆనందయ్య మందుపై అధ్యయనం చేపట్టింది. ఈ మందుపై ప్రస్తుతానికి సీసీఆర్ఏఎస్ అధ్యయనం తొలి దశ పూర్తి కాగా, దాదాపు 500 మంది నుంచి సమాచారం సేకరించి, వారు చెప్పిన సమాధానాలతో మందు గుణగణాలను పోల్చుతున్నారు.
 
కాగా, ఆనందయ్య మందును జంతువులపై ప్రయోగించి కీలక సమాచారం సేకరించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఆనందయ్య మందుపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని టీటీడీతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం